Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహనీయుల త్యాగాలు మరువలేనివి

మహనీయుల త్యాగాలు మరువలేనివి

- Advertisement -

-జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్, సమ సమాజ స్థాపనకై ప్రాణం పోయే వరకు పోరాడిన ప్రజాయుద్ధనౌక గద్దర్ త్యాగాలు అజరామరమని జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి కొనియాడారు. బుధవారం ఆచార్య జయశంకర్ 92వ జయంతి, ప్రసిద్ధ గాయకుడు గద్దర్ 2వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జన జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనానికి, నిర్లక్ష్యానికి గురి అవుతున్న తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో ప్రగతిని సాధించి అభివృద్ధి చెందాలని ఆశించిన వారు జయశంకర్, గద్దర్ అని తెలిపారు.

తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం వాళ్లు నిరంతరం ఆకాంక్షించారని అన్నారు. వారి ఆశయాలను మనందరం కొనసాగించాలని అన్నారు. సమసమాజ నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అందరం భాగస్వాములు కావాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్, కవి నాదమునుల రామారావు, సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు మార్క అనిల్ గౌడ్, కొత్తపల్లి సత్యనారాయణ, జేఏసీ నాయకురాలు కోడూరి శ్రీదేవి, బోయిని రాజమల్లయ్య, బూరుగు కిష్టస్వామి, గట్టు రాములు, సతీష్, బైరి శ్రీను, ఇజ్జగిరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -