Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు 

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు 

- Advertisement -

గోకారం చెరువు నుండి అక్రమ ఇసుక రవాణ
ప్రశ్నించిన వారిపై దాడులు 
నవతెలంగాణ – చారకొండ 

మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయడంతో వ్యవసాయ భూములు, కాలినడక దారులు సర్వనాశనం అవుతున్నాయి. గోకారం గ్రామంలోనీ చెరువు నుండి రోజుకు వందల ట్రాక్టర్ల అక్రమ ఇసుక రవాణా చేస్తూ అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. శుక్రవారం గోకారం గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగంగా వెళుతుంటే, గేదెలకు జీవాలకు తగులుతున్నాయని, నెమ్మదిగా వెళ్ళమని గ్రామానికి చెందిన యువకుడు చెప్పడంతో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ యువకుని పై విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన జరిగింది. అనుమతుల పేరుతో ఇతర మండలాలకు అక్రమ ఇసుకను రవాణా చేస్తున్నారని ప్రశ్నించిన గ్రామస్తులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -