Monday, January 12, 2026
E-PAPER
Homeజిల్లాలుడ్రాలో గెలిచిన చీపురుదుబ్బ తండా సర్పంచ్

డ్రాలో గెలిచిన చీపురుదుబ్బ తండా సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ మెదక్ : మండలంలోని చీపురుదుబ్బ తండా సర్పంచ్ గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 377 ఓటర్లు ఉండగా వారిలో 367 మందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేతావత్ సునీతకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీమిలికి చెరో 182 ఓట్ల వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఒకటి నోటకు పడింది.

ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో రీకౌంటింగ్ నిర్వహించినా అదే ఫలితం రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంతో అభ్యర్థుల సమ్మతితో అధికారులు డ్రా తీయగా.. కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతను విజయం వరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -