సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు 35 రోజులపాటు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిందని తెలిపారు. ఇది పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని పేర్కొన్నారు. పరీక్షలు సుదీర్ఘకాలం జరపడం వల్ల విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడి, మానసిక అలసట, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యా నిపుణుల సలహాలతో శాస్త్రీయమైన పద్ధతిలో కొత్త పరీక్షల షెడ్యూల్‌ను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్థితిగతులపై కనీస అవగాహన లేకుండా, శాస్త్రీయత లేకుండా ఒక్కో పరీక్షకు ఐదు రోజుల చొప్పున సుదీర్ఘ అసమాన గ్యాప్‌లు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ గ్యాప్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్‌ను విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలనే డిమాండ్లు ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. అందువల్ల పరీక్షల ప్రస్తుత షెడ్యూల్‌ను తక్షణమే రద్దు చేసి, శాస్త్రీయ ప్రమాణాలతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



