మంగళవారం రాత్రి 9.30 వరకు నామినేషన్ల స్వీకరణ
నవతెలంగాణ – పెద్దవూర
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. చివరి రోజు రాత్రి 9.30 వరకు నామీనేషన్లు అభ్యర్థులు ధాకలు చేశారు.పెద్దవూర మండలం లో మొత్తం 34,494 ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓటర్లు 16,921,మహిళా ఓటర్లు 17,564,ఇతరులు 9 మంది ఉన్నారుమండలం లో మేజర్ పంచాయతీ ఐనపెద్దవూరగ్రామ పంచాయతీ లో 2423 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1254,పురుషు ఓటర్లు 1169,పులిచర్ల 2068 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 973,పురుష ఓటర్లు 893,మండలం అతి చిన్న పంచాయతీ ఐన పినవూర లో మొత్తం 379 మంది ఓటర్లు అందులోపురుషులు 186,మహిళలు 193 మంది వున్నారు. – సర్పంచి,వార్డుల నామినేషన్లు
మండలం లో 28 గ్రామ పంచాయతీకు 231 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.అందులో అందులో అత్యధికంగా నూతన గ్రామ పంచాయతీ గా ఎంపిక చేసిన సంగారం పంచాయతీ కి సర్పంచి గా 17 నామినేషన్లు వేశారు.ఆతరువాత,కుంకుడు చెట్టు తండా పంచాయతి కి 14 మంది నామినేషన్లు వేశారు.28 పంచాయతీ లాలో 244 వార్డులకు గాను 735 మంది నామినేషన్లు ధాకలు చేశారు. అందులో చలకుర్తి పంచాయతీ లో వార్డులకు 43 నామినేషన్లు, పినవూర పంచాయతీ వార్డులకు 12మంది నామినేషన్లు వేశారు.3న నామినేషన్ల పరిశీలన,6 న ఉపసంహరన,14 న,పోలింగ్ జరుగనుంది.



