Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్అంబులెన్స్ల సిబ్బంది సేవలు అభినందనీయం

అంబులెన్స్ల సిబ్బంది సేవలు అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
మండల కేంద్రంలో అంబులెన్స్లు 108,102 లలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న 108, 102 వాహనాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ క్రమంలో రిజిస్టర్లు, మందులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయో లేదో అని పరిశీలించారు. అంబులెన్స్ కు ఫోన్ వచ్చిన వెంటనే జన్నారం మండలంలో అన్ని గ్రామాలకు అంబులెన్స్ 15 నిమిషాలలో వెళుతున్నారని ఈ సందర్బంగా ఆయన అన్నారు. క్షతగాత్రులను సరైన సమయంలో చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్నికి తరలించడం అభినందనీయమని అన్నారు. ఆ వాహనాలలో డెలివరీలు చేయడం, అత్యవసరంగా స్పందించడం సేవలు అందించడం, సిబ్బంది చేస్తున్న సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. 108, 102 వాహనాలను ప్రజలు అత్యవసరాలకు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో 108, 102 సిబ్బంది, ఈ ఎం టి కిషన్, రమేష్, పైలెట్ రఫిక్ గంగాధర్ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad