మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, యూత్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 18 పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పట్ల పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ఈ విజయాలకు ప్రధాన కారణంగా సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిద్ధన్నల సేవలు మరువలేనివని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, యూత్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ అభినందించారు.
ఈ సందర్భంగా రామ్ రెడ్డి, సిద్ధన్నలకు పూలమాలతో శాలువాలు కప్పి ఘనసన్మానం చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచ్ అభ్యర్థులకు సూచనలు ఇస్తూ, వ్యూహాత్మకంగా ముందుకు నడిపి విజయం వైపు దారితీశారని చిరు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చింటూ, హోమ్, శరత్, భరత్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.



