- Advertisement -
తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
మల్టిపర్పస్ కార్మికుల సేవలు మరువలేనివని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన..ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో తాడిచెర్లలో ప్రతిరోజు సర్పంచ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్యం, అంతర్గత రోడ్లు పరిశుభ్రం, డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగింపు, మంచినీటి ట్యాoకులు శుభ్రం తదితర పనులు చేస్తున్నారు. ఆదివారం పంచాయతీ మల్టీ పర్పస్ కార్మికులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



