- నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో తంగిరాల చక్రవర్తి సంతాప సభ
నవతెలంగాణ-హైదారాబాద్: కవి, రచయిత తంగిరాల చక్రవర్తి సేవలు చిరస్మరణీయమని నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్ అన్నారు. ప్రజాశక్తి, నవతెలంగాణ దినపత్రిక, బుక్ హాస్‌ల్లో సుదీర్ఘకాలం తన సేవలు అందించారని గుర్తు చేశారు. పని పట్ల ఆయన అంకిత భావం శ్రద్ధ..స్పూర్తిదాయకమన్నారు. తంగిరాల అకాల మరణం బాధించిందని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తంగిరాల చక్రవర్తి మృతి తీరని లోటు అని బుక్‌హాస్ ఎడిటర్ ఆనందాచారి, బోర్డు సభ్యులు సలీమా, 10టీవీ మాజీ ఎండీ వేణుగోపాల్ అన్నారు. వృత్తిపరంగా వారితో ఉన్న సాన్నిహిత్యం మరువలేనిదని తెలియజేశారు. వారి కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

శనివారం తంగిరాల చక్రవర్తి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్ లో ఆయన మృతిపట్ల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తంగిరాల చిత్రపటానికి సంస్థ సీజీఎం పి.ప్రభాకర్, బుక్‌హాస్ ఎడిటర్ ఆనందాచారి, 10టీవీ మాజీ ఎండీ వేణుగోపాల్, బోర్డు సభ్యులు సలీమా, జనరల్ మేనేజర్ల, మేనేజర్లు, సిబ్బంది నివాళి అర్పించారు.
























