వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ 
ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు ఘన నివాళులు 
నవతెలంగాణ – వనపర్తి 
మహనీయుల సేవలు మరువలేనివని వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి, భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ లక్కాకుల సతీష్ మాట్లాడారు. ఇందిరాగాంధీ వర్థంతి 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ స్వతంత్య్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె అన్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్న ఆమె, అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. అలాగే కొలంబియా యూనివర్శిటీ నుంచి విశిష్ట ప్రశంసా పత్రం అందుకున్నారు. సాతంత్య్ర పోరాటంలో ఇందిరాగాంధీ చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె “బాల్ చరఖా సంఘ్” స్థాపించారు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలసి “వానర్ సేన” ఏర్పాటుచేశారు. 1942 సెప్టెంబర్‌లో జైలుకు వెళ్ళారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంuచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్ కోఆప్షన్ నెంబర్స్ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళ సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ ఐ ఎన్ టి యు సి వర్క్స్ బోర్డ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 
                                    