నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మిర్జాపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి సేవలు మరువలేనివి అని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ అన్నారు. పట్టణంలోని మామిడిపల్లి రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఇఓ మాట్లాడుతూ.. ప్రాధనోఉపాధ్యాయుని సేవలు కొనియాడారు. పీఆర్టీయు ఆర్మూర్ రూరల్ శాఖ ఆధ్వర్యంలో సన్మాన గ్రహీత పేరుతో జింధం నరహరి రూపొందించిన సన్మాన – ఆనందవల్లి (క్రోనాలజి) అక్షరమాల కర పత్రాన్ని డీఈవో అశోక్ కుమార్ ఆవిష్కరింపజేశారు.
శ్రీనివాస్ రెడ్డి డీఆర్పీ ఎస్ ఆర్జీ గా బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని, వేల్పూర్ మండలంలోని ప్రతి గ్రామంలో బాల కార్మికులు లేరు అని బోర్డులు పెట్టించారని,విద్యా వ్యవస్థలో ఒక మంచి ఉపాధ్యాయుడు రిటైర్ అవుతున్నారంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి జీహెచ్ఎం సంఘం అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. చాలా సౌమ్యమైన మనస్తత్వం గల వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనివాసరెడ్డి ఇటు సంఘంలో అటు విద్యారంగంలో మర్చిపోలేని సేవలందించారని మిర్దాపల్లి పాఠశాల నుండి బాసర్ త్రిబుల్ ఐటీ కి ఎన్నో సీట్లు సాధించి పెట్టారని ఆయన సేవలను కొనియాడారు.
సన్మాన గ్రహీత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 40 వసంతాల ఉద్యోగ ప్రస్థానంలో విద్యా రంగానికి అంకితమై పనిచేశానని కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చి సన్మానించి ఆశీర్వదించిన ఆత్మీయ బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులకు మిర్దాపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇట్టం గోపాల్, పెంట జలంధర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.