- Advertisement -
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
శాంతి భద్రతల విషయంలో పోలీసుల సేవలు మరువలేనివని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు పోలీసుల సేవల గురించి వివరంగా మాట్లాడారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు అనంతరం వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు, సిఐ నాగరాజు, ఎస్సైలు విజయభాస్కర్, ఇందిర, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -