Friday, July 4, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ‌లో మ‌హిళా పోలీసుల సేవ‌లు అద్బుతం

తెలంగాణ‌లో మ‌హిళా పోలీసుల సేవ‌లు అద్బుతం

- Advertisement -

మిస్ వ‌ర‌ల్డ్ సుచాత శ్రీ
న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శంషాబాద్‌ విమాన‌శ్రేయంలో మిస్ వరల్డ్ – 2025 ఓపల్ సుచత శ్రీ కి ఘనంగా సాంప్రదాయక ప‌ద్ద‌తుల‌లో హృదయపూర్వక వీడ్కోలు పలికారు.
ఈ సంధ‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. మా థాయ్ లాండ్ లో విమెన్ పోలీస్ అసలే కనిపించరు. మొత్తం మగ పోలీస్ లే ఉంటారు. కానీ, తెలంగాణ, హైదరాబాద్ లో నేను ఫ్లైయిట్ దిగిన దగ్గరనుండి, తిరిగి వెళ్లే వరకు పోలీసులలో సగం మంది విమెన్ పోలీసులే కనిపించారు. అంతెందుకు, నాకు మొదటి రోజు నుండి తిరిగి వెళ్లేంతవరకు విమెన్ పోలీస్ లు నావెంటే ఉండి, కంటికి రెప్పగా కాపాడుకున్నారు. తెలంగాణలో మహిళా భద్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయి. ఇది, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మహిళా భద్రతా చర్యలు మా దేశంలోనూ అమలు చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుతాను అని ఆమె అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -