సిన్సినాటి ఓపెన్
సిన్సినాటి (యుఎస్‌ఏ) : మహిళల టెన్నిస్ అగ్రతారలు ఇగా స్వైటెక్ (పొలాండ్), అరినా సబలెంక (బెలారస్) సిన్సినాటి ఓపెన్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ అమ్మాయి మార్టా వాకోవర్‌తో స్వైటెక్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకోగా.. బ్రిటన్ అమ్మాయి రెడుకానుతో మహా పోరులో సబలెంక అతికష్టంగా గట్టెక్కింది. 7-6(7-3), 4-6, 7-6(7-5)తో ఉత్కంఠ మ్యాచ్‌లో సబలెంక పైచేయి సాధించింది. ఏడు ఏస్‌లు, రెండు బ్రేక్ పాయింట్లతో సబలెంక మెరువగా.. 9 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో రెడుకాను రాణించింది. కానీ టైబ్రేకర్‌లకు దారితీసిన తొలి, ఆఖరు సెట్లను సొంతం చేసుకున్న సబలెంక మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో జానిక్ సినర్ (ఇటలీ) 6-2, 7-6(8-6)తో గాబ్రియెల్‌పై గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపాడు.
మెరిసిన సబలెంక
- Advertisement -
- Advertisement -