Sunday, November 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలువణికిస్తున్న చలి..పడిపోయిన ఉష్ణోగ్రతలు

వణికిస్తున్న చలి..పడిపోయిన ఉష్ణోగ్రతలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో ఏపీలోని అల్లూరి జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణ‌లోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -