Wednesday, December 3, 2025
E-PAPER
Homeజిల్లాలుగుర్తులు వచ్చేసాయి... ప్రచార సామాగ్రికి పరుగో పరుగు...

గుర్తులు వచ్చేసాయి… ప్రచార సామాగ్రికి పరుగో పరుగు…

- Advertisement -

ప్రింటింగ్ ప్రెస్ ల వద్ద సందడే సందడి….

గెలుపు ధీమాతో హోరా హోరి ప్రచారాలు

నవతెలంగాణ షాద్ నగర్ రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లతో ప్రారంభమైన పంచాయతీ పోరు మరో అంకానికి చేరుకుంది. బుధవారం ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. పోటీల్లో ఉన్న సర్పంచ్ వార్డ్ అభ్యర్థుల కు తెలుగు పదాక్షరాల మేరకు గుర్తులను కేటాయించారు. గుర్తులమేరకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచార గుర్తులతో విస్తృత ప్రచారానికి ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాల్లో తమ మద్దతుదారులతో ప్రతి గడపకు తమ గుర్తులు అందించి ఓటును అభ్యర్థించే పనిలో నిమగ్నం అవుతున్నారు. 

ఎన్నికల సామాగ్రి కొనుగోలుకై అభ్యర్థుల పరుగు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో పర్వం ప్రారభమైంది. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో వారికి కేటాయించిన గుర్తుల సామాగ్రిని కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. గుర్తులతో ఉన్న టోపీలు, కండువాలు, కీ చైన్లు, బొట్టు బిళ్ళలు, జెండాలు, కరపత్రాలు తదితర ప్రచార సామాగ్రిని కొనుగోలు చేసేందుకు దుకాణాలకు పయనం అవుతున్నారు. వినూత్న ప్రచారం సామాగ్రితో ఓటర్లను ఆకర్షించేందుకు ముందుకు సాగుతున్నారు.

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అభ్యర్థుల మేనిఫెస్టో….

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో  మౌళిక వసతులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మేనిఫెస్టోను తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రజల్లో ఉంటా అభివృద్ధికి పాటుపడతానంటూ ప్రచారం మంత్రాన్ని హోరెత్తిస్తున్నారు …

ప్రింటింగ్ ప్రెస్ లు బిజీబిజీ….

పట్టణంలోని ప్రింటింగ్ ప్రెస్ లు గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రిని విక్రయిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో కూడిన ఎన్నికల సామాగ్రిని విక్రయించేందుకు సిద్ధం చేయగా కొనుగోలుదారులతో షాపులు బిజీబిజీగా సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల జెండా రంగులతో సర్పంచ్ అభ్యర్థుల గుర్తుల జెండాలను కండువ, టోపీల ప్రచార సామాగ్రిని విక్రయాలకు సిద్ధం చేశారు. గాంధీనగర్ కాలనీ, పద్మావతి కాలనీలోని ప్రింటింగ్ ప్రెస్ దుకాణాల వద్ద ఎన్నికల సామాగ్రి కొనుగోలుదారులతో కిక్కిరిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -