Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమా'సింగారి' సందడి మొదలైంది

‘సింగారి’ సందడి మొదలైంది

- Advertisement -

హీరోప్రదీప్‌ రంగనాథన్‌ పాన్‌ ఇండియా మూవీ ‘డ్యూడ్‌’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్‌ సరసన మమిత బైజు నటించగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. రీసెంట్‌గా విడుదలైన ‘బూమ్‌ బూమ్‌, బాగుండు పో’ సాంగ్స్‌ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘సింగారి’ సాంగ్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ స్వర పరచి పాడారు. ఎనర్జిటిక్‌ బీట్స్‌, క్యాచీ లిరిక్స్‌, యూత్‌ ఎనర్జీ ఈ సాంగ్‌ని ఒక ఫన్‌ ప్యాకేజ్‌లా మార్చేశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్‌ సాంగ్‌కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది.

ఫన్‌ఫుల్‌గా వినిపించే ఈ ట్రాక్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ప్రదీప్‌ అద్భుతమైన కామిక్‌ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు పాటకు మరింత మజాను తెచ్చాయి. సాయి అభ్యంకర్‌ తన ఫస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ మ్యూజిక్‌ తోనే మంచి ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పటికే అన్ని భాషల యువతరంలో సాంగ్స్‌ పాపులర్‌ అవుతున్నాయి. ఈనెల 17న దీపావళి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. రోహిణి మొల్లెటి, హదు హరూన్‌, ద్రవిడ్‌ సెల్వం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, సిఈఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనిల్‌ యెర్నేని, సంగీతం: సాయి అభ్యంకర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -