Thursday, July 3, 2025
E-PAPER
Homeఖమ్మంఆకాశం మేఘావృతం

ఆకాశం మేఘావృతం

- Advertisement -

చెదురుమదురు జల్లులు
దమ్మపేటలో అత్యధికం..
అశ్వారావుపేటలో అత్యల్పం..
వర్షపాతం 224.9 మి.మీ నమోదు..
తిరుములకుంటలో పూరి గుడిసె ధ్వంసం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. అరేబియా సముద్రంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో ఉత్తర బంగాళా ఖాతాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ లో తుపాన్ సంభవించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా అశ్వారావుపేట నియోజక వర్గం వ్యాప్తంగా ఎడతెరిపిలేని జల్లులు కురుస్తున్నాయి.

నియోజక వర్గంలోని అయిదు మండలాల్లోని 10 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8.30 నుండి బుధవారం ఉదయం 8.30 గంటలు వరకు 224.9 మి.మీ వర్షపాతం నమోదు అయింది. ఇందులో దమ్మపేట మండలంలో అత్యధికంగా 94.3 వర్షపాతం నమోదు కాగా అశ్వారావుపేట మండలంలో 16.0 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు రెవిన్యూ శాఖ ప్రకటించింది. తిరుములకుంట ఎస్సీ కాలనీ కి చెందిన మోటూరు బాబూరావు,సావిత్రి ల పూరి గుడిసె ఒకటి వర్షాలకు శిధిలం అయింది.

ప్రాంతం               మండలం               వర్షపాతం
ములకలపల్లి       ములకలపల్లి                49.9
అంకంపాలెం        దమ్మపేట                      35.0
మద్దుకూరు         చండ్రుగొండ                    32.8
పెంట్లం                అన్నపురెడ్డిపల్లి               32.3
నాయుడుపేట     దమ్మపేట                       21.8
మందలపల్లి        దమ్మపేట                       20.0
మల్కారం           దమ్మపేట                       17.5
అశ్వారావుపేట    అశ్వారావుపేట               16.0
నాగుపల్లి             దమ్మపేట                       00.0

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -