నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధి సమీపంలో బొడ్రాయి, పెద్ద రోలు వద్ద నివాసముంటున్న ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రీ, గౌతమిలు ఉన్నారు. మృతుడికి కుమారులు లేరు. దీంతో తండ్రికి తప్పనిసరి పరిస్థితులలో పెద్ద కుమార్తె గాయత్రి శవయాత్రలో ముందు నడిచి తలకొరివి పెట్టింది.
మృతుడు వెల్డింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు, పట్టణ మున్నూరు కాపు సంఘ సభ్యులు, వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్నూరు కాపు సంఘం సభ్యులు, వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు, బoధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



