Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమాగొప్ప సందేశాన్నిచ్చే 'శివోహం' పాట

గొప్ప సందేశాన్నిచ్చే ‘శివోహం’ పాట

- Advertisement -

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన ‘శివోహం’ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్‌ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు.
దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకష్ణ సంగీతాన్ని అందించిన ఈ పాటను మలయాళ గాయకుడు మధు బాలకష్ణన్‌ పాడారు.
ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ, నటుడు గౌతమ్‌ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు యశోకష్ణ మాట్లాడుతూ, ‘ఇలాంటి పాటకు సంగీతాన్ని అందించే అదష్టం నాకు దక్కింది’ అని అన్నారు.
‘హిందీతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో రూపొందించాం. మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత భక్తి పారవశ్యంతో జరుపుకునేలా మా శివోహం పాట ఉంటుంది’ అని దర్శకుడు దామురెడ్డి చెప్పారు.
నిర్మాత పొత్తపు కేశవరెడ్డి మాట్లాడుతూ,’భక్తి భావంతో పాటు ఒక గొప్ప సందేశాన్ని భక్తులకు ఇచ్చేలా ఈ పాటను నిర్మించాం’ అని అన్నారు. ‘ఈ పాటలో నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నా. శివ భక్తితో లీనమై ఈ పాటలో నటించాను. ఈ పాటను ఈషా ఫౌండేషన్‌ ప్రాంగణంలో చిత్రీకరించే అవకాశం కలిగింది’ అని నటులు తనికెళ్ల భరణి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -