జెమిని సురేష్, అఖిలనాయర్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆత్మకథ’. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సోమేశ్వరరావు నిర్మాత.
ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, జెమిని కిరణ్ చేతుల మీదుగా చిత్ర బృందం అందుకోగా, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ, ‘నటుడిగా నా 18 సంవత్సరాల కల నేడు నెరవేరబోతుంది. ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అని తెలిపారు.
‘నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి, జెమిని సురేష్‌కి ప్రత్యేక ధన్యవాదాలు’ అని నటి అఖిల చెప్పారు. దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ,’నేను ఇప్పటికే ఒక హిందీ, నాలుగు కన్నడ చిత్రాలకు, అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్, సమ్మెట గాంధీ రెండు స్తంభాలు వంటి వారు’ అని చెప్పారు. ‘నేను గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు వాయిద్యాలను ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మేకర్స్‌కు థ్యాంక్స్’ అని సంగీత దర్శకులు శ్రేయాస్ అన్నారు.
బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తగుబోతు రమేష్, నూకరాజు, గుర్రపు విజరు కుమార్, డి. సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు: ఎం.వి.గోపీ, ఎడిటర్: రాఘవేంద్ర రెడ్డి
‘ఆత్మ కథ’ ప్రారంభమైంది
- Advertisement -
- Advertisement -