Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమా'అతడు' రీ-రిలీజ్‌కి రంగం సిద్ధం

‘అతడు’ రీ-రిలీజ్‌కి రంగం సిద్ధం

- Advertisement -

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబి నేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్‌ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. జయభేరి ఆర్ట్స్‌ బ్యానర్‌ మీద మురళీ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న రీ రిలీజ్‌ చేయబోతోన్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నిర్వహిం చిన రీ- రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో మురళీ మోహన్‌ మాట్లాడుతూ,’ఆగస్ట్‌ 9న మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా ‘అతడు’ని రీ-రిలీజ్‌ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా నా సోదరుడు కిషోర్‌ తనయ ప్రియాంక ఈ మూవీని అప్‌ గ్రేడ్‌ చేసి మీ ముందుకు తీసుకువస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా థియేట్రికల్‌ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్‌ చేసింది. మా బ్యానర్‌లో మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు. అప్పటికే అధునాతన సాంకేతికతో తీశాం. అద్భుతమైన డైలాగ్స్‌తో త్రివిక్రమ్‌ అందరినీ మెప్పించారు. అందుకే త్రివిక్రమ్‌ మాటల మాంత్రికుడు అయ్యారు. ఈ మూవీకి మొదట్లో డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ ఆ టైంలో ఈ మూవీ ఓవర్సీస్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అలాగే బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ-రిలీజ్‌కు ఇంత క్రేజ్‌ ఏర్పడింది. ఇక ఇందులో నాజర్‌ పోషించిన పాత్రకి శోభన్‌ బాబుని అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్‌ చెక్‌ పంపించాం. హీరోగానే అందరికీ గుర్తుండాలి. కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్రని రిజెక్ట్‌ చేశారు. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్‌ నిర్మిస్తుంది’ అని తెలిపారు.
మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ప్రతినిధి అన్వేష్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్‌ కోసమే వాడుతున్నాం. మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం’ అని అన్నారు.
”అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8కె, సూపర్‌ 4కెలోకి మార్చాం. డాల్బీ సౌండ్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్‌ ఫైట్‌లో సౌండింగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ మూవీని థియేటర్లో చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తాయి’ అని జయభేరి ఆర్ట్స్‌ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల చెప్పారు.
ఎక్సెల్‌ బ్యానర్‌ ప్రతినిధి జితేంద్ర గుండపనేని మాట్లాడుతూ, ‘ఈ సినిమా రీ-రిలీజ్‌ అని తెలిసిన వెంటనే నేను వెళ్లి సంప్రదించాను. ఇప్పటి వరకు రీ -రిలీజ్‌ అయిన చిత్రాల కంటే ఎక్కువగా కలెక్షన్లను సాధిస్తుందని నమ్ముతున్నాను. మరోసారి ‘అతడు’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -