Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి 

బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి 

- Advertisement -

బ్యాండ్ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి అంకుష్
వాల్ పోస్టర్ ఆవిష్కరణ 
నవతెలంగాణ – తాడ్వాయి  

ఈ నెల 16 న హన్మకొండలో జరుగబోయే బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సు ను విజయవంతం చేయాలని ములుగు జిల్లా అధ్యక్షులు ఎండి అంకుష్ పిలుపునిచ్చారు. తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం దోబే సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశం లో అంకుష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యాండ్ కళాకారులకు గుర్తింపు కార్డులను, ఉచిత వైద్య సౌకర్యం, బ్యాంకులో సబ్సిడీపై రూ.2 లక్షల వాయిద్యా పరికరాలు, ప్రమాద బీమా, ప్రభుత్వమే శిక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాబై సంవత్సరాలపై బడిన వారికి పింఛన్ ఇవ్వాలని, డి జేలను నిషేదించాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊకె రాజు, సాంబయ్య, మoకిడి రవీ, పెనక సదానందం, గంగారాజు, సురేష్, బాబు రావు, రమేష్, పూరషోత్తమ్ శ్రీను, లక్ష్మిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -