Monday, June 30, 2025
E-PAPER
Homeసినిమా'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' రిలీజ్‌కి రెడీ

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

నరేష్‌ అగస్త్య హీరోగా దర్శకుడు విపిన్‌ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. రబియా ఖతూన్‌ కథానాయిక. ఇప్పటికే రిలీజ్‌ అయిన రెండు టీజర్లు, సాంగ్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. హీరో నరేష్‌ అగస్త్యతో పాటు ప్రధాన నటులంతా కనిపించిన రిలీజ్‌ డేట్‌ అనౌన్స్మెంట్‌ పోస్టర్‌ చాలా ప్లజెంట్‌గా ఉంది. ఆడియన్స్‌కి ఓ మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. రాధిక శరత్‌కుమార్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్‌, ఆమని, తులసి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మాస్టర్‌ కార్తికేయ, మోహన్‌ రామన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – విపిన్‌, నిర్మాత – ఉమాదేవి కోట, సినిమాటోగ్రాఫర్‌ – మోహన కష్ణ, సంగీతం – జస్టిన్‌ ప్రభాకరన్‌, ఆర్ట్‌ – తోట తరణి, ఎడిటర్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -