Friday, October 17, 2025
E-PAPER
Homeజిల్లాలుమెద‌క్ రీజిన‌ల్ డెస్క్ ఇంచార్జీ అనిల్ హఠాన్మరణం బాధాకరం

మెద‌క్ రీజిన‌ల్ డెస్క్ ఇంచార్జీ అనిల్ హఠాన్మరణం బాధాకరం

- Advertisement -
  • నివాళులు అర్పించిన సీజీఎం ప్రభాకర్, మఫిషల్ ఇన్ చార్జీ వేణుమాధవ్

నవతెలంగాణ మెదక్: న‌వ‌తెలంగాణ మెద‌క్ రీజిన‌ల్ డెస్క్ ఇంచార్జీ అనిల్ కుమార్ గురువారం అకాల మ‌ర‌ణం చెందారు. శుక్రవారం అనిల్ కుమార్ స్వగ్రామం సదాశివపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు న‌వ‌తెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, హెచ్ ఆర్ జనరల్ మేనేజర్ పి.నరేందర్ రెడ్డి, మఫిషల్ ఇన్ చార్జీ, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు జి.వేణుమాధవ్ , మెద‌క్ రీజిన‌ల్ మేనేజర్ రేవంత్ అనిల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ పట్ల అంకితభావంతో పని చేసిన వ్యక్తి అనిల్ అని ఆయన సేవలను గుర్తుచేశారు. అనిల్ అకాల మరణం బాధాకరం అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో నవతెలంగాణ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -