- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ కార్యదర్శి శ్రీనివాసు నాయక్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల్లో నీటి గుంతలు ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆశ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -