డ్రామా, యాక్షన్ థ్రిల్లర్‌గా కన్నడలో రూపొందిన చిత్రం ‘ది టాస్క్’. అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రానుంది. జయసూర్య ఆర్.ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిశోర్ తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో ‘తల్లి మనసు’ వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంత కిశోర్ పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంతా కొత్త వారు నటించారని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగతా వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు.
తెలుగులోనూ ‘ది టాస్క్’ రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



