నవసమాజ రూపశిల్పులు ఉపాధ్యాయులే…
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మణుగూరు
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నవ సమాజ రూప శిల్పులు ఉపాధ్యాయులేనని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత కో ఎడ్యుకేషన్ పాఠశాలలో మణుగూరు నందు మణుగూరు మండల విద్యాశాఖ అధికారి జి స్వర్ణజ్యోతి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురుపూజోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరైనారు. మణుగూరు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులను శాలువాలు, బొకేలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సర్టిఫికెట్లతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నవ సమాజ రూపశిల్పులు ఉపాధ్యాయులే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఉపాధ్యాయులు అందరూ ఆదర్శంగా తీసుకొని తమ వృత్తిలో మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేయాలన్నారు. మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పానెల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయుల విభాగంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ మణుగూరు ప్రధానోపాధ్యాయులు జి నాగశ్రీ, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ పి ఏ ఎన్ సిహెచ్ఎంసి విభాగంలో బి.రామారావు, తోలం శ్రీనివాసరావు ఎస్ జి టి విభాగంలో రఘుమోహనరావు పి స్వరూప రాణి చాముండేశ్వరి బి రాము గిరిజన సంక్షేమ పాఠశాలల విభాగంలో పి.సత్యాదేవి లక్ష్మీకాంతాలు మణుగూరు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పొందారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. శ్రీనివాసరావు, రామానుజవరం పి .జి .హెచ్. ఎం .యశోద నాగేశ్వరరావు బాబు పుర ప్రముఖులు, టీచర్స్ కోటేశ్వరరావు బ్రహ్మయ్య సురేష్ రామకృష్ణ భూక్యశంకర్ కిషోర్ కిషన్ మణుగూరు మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES