Wednesday, December 10, 2025
E-PAPER
Homeసినిమాభయపెట్టే 'ఈషా'

భయపెట్టే ‘ఈషా’

- Advertisement -

హర్రర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీవాస్‌ ఈనెల 25న థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకుడు. కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ,’ఇది కేవలం హర్రర్‌ మాత్రమే కాకుండా థ్రిల్లర్‌ మూవీ కూడా’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో కచ్చితంగా భయపెడతాం. సినిమా చూసి రాత్రి పూట ఆంజనేయ దండకం చదువుతారు’ అని బన్నీవాస్‌ చెప్పారు. ‘సినిమా చూసి భయపడని వారు నాకు కాల్‌ చేయండి. శ్రీనివాస్‌ ‘ఈషా’ని అద్భుతంగా తెరకెక్కించారు’ అని వంశీ నందిపాటి చెప్పారు. హీరో త్రిగుణ్‌, హెబ్బా పటేల్‌, దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, నిర్మాత హేమ వెంకటేశ్వర రావు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌ ధవన్‌, కెమెరామెన్‌ సంతోష్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -