– ఢిల్లీ పేలుళ్ళను ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : దేశ రాజధానికి నట్టనడిబొడ్డున సోమవారం రాత్రి జరిగిన భయంకరమైన బాంబు దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు, తుపాకు లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తుండడం పట్ల తీవ్రంగా కలత చెందుతున్నామని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇప్పుడు ఈ దాడికి ఆ పేలుడు పదార్ధాల స్వాధీనానికి సంబంధం వుందని అనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం అమలు చేసిన ప్రణాళికలా వుందని తెలుస్తోం దని పేర్కొంది. ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరు వున్నారో వారందరినీ పైకి లాగి, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సీపీఐ(ఎం) పేర్కొం ది. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా శాంతి, సామరస్యతలను పాటిస్తూ అప్రమత్తంగా వుండాల్సిందిగా ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేసింది.
జ్యుడీషియల్ విచారణ జరగాలి
సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ కూడా ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్లను తీవ్రంగా ఖండించింది. ఈ విషాద ఘటనలో అశువులు బాసిన వారికి సంతాపం తెలియచేస్తూ గాయపడిన వారికి, ప్రభావితులైన వారందరికీ సంఘీభావాన్ని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ వర్గాల, అంతర్గత భద్రతా యంత్రాంగం ఘోర వైఫల్యాన్ని ఈ దారుణ ఘటన మరోసారి బట్టబయలు చేసిందని సీపీఐ(ఎం) విమర్శించింది. గతంలో ఎన్ని సంఘటనలు జరిగినా, పదే పదే హెచ్చరికలు వచ్చినా సంబంధిత అధికారులు ఇటువంటి దాడులను నివారించడంలో విఫలమయ్యారని విమర్శించింది. ఈ పేలుళ్ళపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా, నిర్దిష్ట కాలపరిమితిలో జ్యుడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేసింది. నిఘా, భద్రతా వైఫల్యాలకు బాధ్యులెవరో నిర్ధారించాలని కోరింది. ఉగ్ర నెట్‌వర్క్‌ను గుర్తించి, ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయాలని కోరింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి, సమాజాన్ని విభజించాలని చూస్తున్న విద్వేష రాజకీయాలను నిరసించాల్సిందిగా ప్రజలకు పిలుపిచ్చింది.
ఉగ్ర మూకల నెట్‌వర్క్‌ను బట్టబయలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



