Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి..

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి..

- Advertisement -

– త్రిబుల్ ఆర్ బాధితులు..
నవతెలంగాణ – బంజారా హిల్స్

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. త్రిబుల్ ఆర్ వద్దురా వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయం కి చేరుకొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అనంతరం రోడ్ల పేరుతో తమ భూములను లాక్కునే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద నగరాలకు లేని తిరుమలర్లు మనకెందుకు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -