ఏడు వేల మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణ
అందెశ్రీ కుమారుడికి ఉద్యోగం
జైన్ తిరుమలాపురం గ్రామానికి జయన్న తిరుమలాపురం పేరు
నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
నాలుగు బిల్లులకు రాష్ట్ర శాసనసభ శనివారం ఆమోదం తెలిపింది. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేకుండా ఉన్న పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రి సీతక్క ప్రవేశ పెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ నిబంధనను శాసనసభ ఎత్తేసింది. అయితే ఈ ప్రతిపాదనను బీజేపీ సభ్యులు వెంకటరమాణారెడ్డి, సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు వ్యతిరేకించారు. జనాభా నియంత్రణ కోసం యువత స్వీయ నియంత్రణ పాటిస్తున్నారనీ, ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని సూచించారు. రాజకీయ వెసులుబాటు కోసం ఇలా చేయడం సరైందికాదని బీజేపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ లేదని మంత్రి సీతక్క చెప్పారు. దక్షణాది రాష్ట్రాల్లో నియంత్రణ పాటించడంతో కొంత జనాభా తగ్గిందన్నారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా జనాభా పెంచుకోవాలని సూచించారు.
కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఏడువేల మంది జూనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్స్‌ను క్రమబద్దీకరిస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బిల్లును ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఆశాలు, అంగన్‌వాడీ, మల్టీపర్పస్, విద్యుత్ శాఖలో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు. తెలంగాణ ఉద్యమకారులు, పాటల రచయిత, కవి అందెశ్రీ కుమారుడికి విద్యా శాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భం గా తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పోషించిన పాత్ర, కవి, రచయితగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో జైన్ తిరుమలాపురం అనే గ్రామానికి ఉన్న చారిత్రాత్మక నేపథ్యం రీత్యా జయన్న తిరుమలాపురంగా పేరు మార్చుతూ మంత్రి సీతక్క ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించారు. మూడు గ్రామాల పేర్లు మార్చాలంటూ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



