Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవ్యవసాయంలో బయోటెక్నాలజీ వినియోగం పెరగాలి

వ్యవసాయంలో బయోటెక్నాలజీ వినియోగం పెరగాలి

- Advertisement -

– ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డా. ఆర్‌ఎం.సుందరం
– ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సదస్సు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ఎం.సుందరం అన్నారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు, దిగుబడులు వంటి సమస్యలను వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం బయోటెక్నాలజీ సాధనాల వినియోగంపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. ‘పంటల అభివృద్ధికి బయోటెక్నాలజీ వినియోగం : ముఖ్యమైన పురోగతులు’ అనే అంశంపై సదస్సును వ్యవసాయ విశ్వవిద్యాలయం, బయోటెక్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహించాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండిస్టీ ఆఫ్‌ ఇండియా మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఆర్‌ఎం సుందరం మాట్లాడుతూ.. బయోటెక్నాలజీ ఆవిష్కరణలను అర్థం చేసుకోవడానికి, సమర్థవంతంగా ప్రజలకు వివరించడానికి, బాధ్యతగా అమలు చేయడానికి అధికారుల నుంచి పాలసీ మేకర్ల వరకూ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ ఉత్పాదకతలో పురోగతి సాధించిందన్నారు. అయినా, భవిష్యత్‌ అవసరాల కోసం భూమి విస్తీర్ణాన్ని పెంచడం కాకుండా, సాంకేతిక పురోగతిపై దృష్టి పెట్టాలని సూచించారు.బయోసీడ్స్‌ డివిజన్‌, డీసీఎం శ్రీరామ్‌ లిమిటెడ్‌ డాక్టర్‌ పరేష్‌ వర్మ మాట్లాడుతూ.. బయోటెక్నాలజీ అనేది తుది లక్ష్యం కాదన్నారు. కానీ స్థిరమైన వ్యవసాయం దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మార్గమన్నారు. జన్యు మార్పు ద్వారా తక్కువ ఎరువులు, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పంటల సాగు సాధ్యమన్నారు. దాంతో రైతులకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు. పంటలు వాతావరణ మార్పులు, తెగుళ్లకు తట్టుకునేలా మారతాయని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, తెగుళ్లు, పోషక లోపాల సమస్యలను పరిష్కరించేందుకు.. ఇప్పుడు శాస్త్రవేత్తలకు జన్యు మార్పు, జీనోమ్‌ ఎడిటింగ్‌ అనే రెండు శక్తివంతమైన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బయోటెక్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ విభా ఆహుజా మాట్లాడుతూ.. శాస్త్రీయ అభివృద్ధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, రైతు సముదాయా లతో చర్చలు జరపడం అవసరమని చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ ప్రయోగశాలల్లో చాలా పరిశోధనలు జరుగుతున్నా యన్నారు. అవన్నీ ప్రజలకు ఉపయోగపడాలంటే సమర్థవంతంగా అమలు చేసే మార్గాలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్‌ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వైజి.ప్రసాద్‌, యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img