Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్40 రోజులుగా పశు వైద్యశాలకు తాళం.!

40 రోజులుగా పశు వైద్యశాలకు తాళం.!

- Advertisement -

ఇబ్బందుల్లో జీవాల పెంపకం దారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని వళ్లెంకుంట గ్రామంలో ఉన్న గ్రామీణ పశు వైద్యశాలకు తాళం వేసు 40 రోజులు గడుస్తున్నా తెరవకపోవడంతో జీవాలకు వైద్యం చేయికచడానికి పశువుల పెంపకం దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే ఎముకలు కొరికే చలికాలం కావడంతో ఈ సీజన్లో జీవాలకు ఎక్కువగా సీజనల్ వ్యాధులు సోకె ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఈ ఉప కేంద్రంలో విధులు నిర్వహించే పశు వైద్య సిబ్బంది 40 రోజుల క్రితం బదిలీపై వెళ్లినట్లుగా అప్పటి నుంచి ఉప కేంద్రానికి తాళం తీసి మూగజీవాలకు వైద్యం అందించే నాథులు కరువైయ్యారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన పశు వైద్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని ఉప కేంద్రం తాళం తీసి జీవాలకు వైద్యం అంధించేలా చర్యలు తీసుకోవాలని పశువుల పెంపకం దారులు కోరుతున్నారు. ఈ విషయంపై నవ తెలంగాణ మండల పశు వైద్యాధికారి అబిలాస్ ను వివరణ కోరగా ఆ ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అక్టోబర్ 16న బదిలీపై వెళ్లారని, శుక్రవారం నుంచి కొత్త సిబ్బంది హాజరైయ్యేలా చూస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -