నవతెలంగాణ – కుభీర్
మండలంలోని చాత గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రయివేట్ గా విధులు నిర్వహస్తున్న భోజన్న ఇటీవల గ్రామంలో విద్యత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదవాషత్తు విద్యుత్ స్తంభం నుంచి కింద పడి ప్రమాదానికి గురి అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. భోజన్న వెన్నుమూక భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో వైద్య ఖర్చులు లక్షల్లో అవుతాయని వైద్యులు తెలపడంతో బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి సోమవారం విద్యుత్ శాఖ అధికారి, పంచాయతీ, తహసీల్దార్ లకు వేరు వేరుగా వినతిపత్రలు అందజేశారు.
ఈ సందర్బంగా బాధిత కుటుంబకు లు మాట్లాడుతూ.. గత 25సంవత్సరాలనుండి గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ లో పనిచేస్తున్నాడని ప్రమాదానికి గురి ఐతే ఏఒక్క రు కూడా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. రేకడితే గాని డొక్కాడని కుటుంబం మది ఇంటి కి పెద్ద దిక్కు ఐన మంచాన్న పడడంతో తినడానికి ఇబ్బంది ఉన్న తమకు లక్షల్లో వైద్య ఖర్చులు ఇలా బరిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడలని కోరారు.
– 25సంవత్సరాలు పని చేసుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది కాదని అంటున్నారు..
గత 25సంవత్సరాల నుండి తన భర్త ను రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయించుకున్న అధికారులు ప్రస్తుతం తన భర్త ప్రమాదానికి గురి ఐ అస్పత్రి లో ప్రాణాలతో కొట్టు మిట్టడుతుంటే సహాయం కోసం అధికారుల వద్దకు వెళ్తే మీ భర్త గ్రామ పంచాయతీ సిబ్బంది కాదని తమకేమి సంబంధం లేదని అధికారులు చేతులు ఎత్తేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ నుండి ఇన్ని ఏండ్లుగా జీతం ఇస్తున్న గ్రామ పంచాయతి సిబ్బంది కాదనడం పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కాకా పొతే తన భర్త తో పని చేసుకున్న వారే తన భర్త ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తన కు న్యాయం జరగకపోతే ఎక్కడికైనా వేతనని హెచ్చరించారు.