డివైఎఫ్ఐ, టి.ఏ.జి.ఎస్ కెవిపిఎస్
నవతెలంగాణ – కాటారం
సావిత్రిబాయి పూలే 195వ జయంతిని కాటారంలో డీవైఎఫ్ఐ, టీఏఈఎస్, కేవీపీఎస్ విద్యార్థి సంఘాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత, కో కన్వీనర్ బుర్ర స్వాతి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్ లు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాన్ని పుణికిపోచ్చుకొని ఆనాడే మహిళలకు విద్య అవసరమని చెప్పి మహిళల్లో విద్యా స్ఫూర్తిని నింపారని అన్నారు.
సమాజంలో మహిళల హక్కుల కోసం నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఉండే విధంగా మనువాదుల దాడులను ఎదిరించి రాళ్లను తీసుకొని ఈ సమాజంలో విజ్ఞాన విద్యా పుష్ప కుసుమాలను వికసింపజేశారని అన్నారు. మాతృమూర్తి మహాత్మ సావిత్రిబాయి పూలే అని, వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుత సమాజంలో వారి స్ఫూర్తితోనే ముందుకు సాగాలని తెలిపారు. మనవాదపు చీకట్లను తరిమికొట్టి విజ్ఞానపు వెలుగులను నింపేందుకు సావిత్రిబాయి పూలే జీవితం గురించి చదవాలని ఈ సమాజాన్ని చదివించే విధంగా విద్యార్థి యువజన ప్రజలందరూ కూడా పాటుపడాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో 50 మంది యువజనులు పాల్గొన్నారు.



