Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్రైతుల  శ్రేయస్సే మా సొసైటీ లక్ష్యం

రైతుల  శ్రేయస్సే మా సొసైటీ లక్ష్యం

- Advertisement -

ధర్మారం పిఎసిఎస్ అధ్యక్షులు కట్టంగూరి శ్రీకాంత్ రెడ్డి
సింగిల్ విండో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ – జమ్మికుంట
: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామప్రాథమిక వ్యవసాయ సహకర సంఘ నూతన భవన నిర్మాణానికి ఆ గ్రామంలో గురువారం సింగిల్ విండో అధ్యక్షులు కట్టంగూరి శ్రీకాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడతల  ప్రణవ్ బాబు  నూతన భవనం కోసం ఎస్ డి ఆర్ ఎఫ్   నిధుల నుండి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. నిధులు కేటాయించినందుకు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మేడిపల్లి మొగిలి , డైరెక్టర్లు పోల్నేని జగన్ రావు , పాత టి ఆర్ వి ప్రసాద్,  మహేష్ భాస్కర్  , మేడిపల్లి శ్రీనివాస్ , పొన్నం రమణ , పూరెల్లి భద్రయ్య, బండి స్వరూప , చేనేత సహకార సంఘం చైర్మన్ పెండెం సర్వేశం , మాజీ సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు , సొసైటీ సీఈఓ గిర్నిటి శ్రీనివాస్ , సంఘం సభ్యులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad