మండలంలో 2 సర్పంచ్ లు, 26 వార్డులు ఏకగ్రీవం
నవతెలంగాణ – మల్హర్ రావు:-
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కీలకమైన నామినేషన్ల ఉపసంహ రణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.మండలంలోని ఆయా గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అబ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తుల వివరాలతో ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు జాబితాను మంగళవారం ప్రదర్శించారు.మం డలంలో మొత్తం15 పంచాయతీలకు గాను చిన్నతూoడ్ల,దుబ్బపేట గ్రామాల సర్పంచ్ లు,26 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.మిగిలిన 13 సర్పంచ్ పదవులకు ఉపసంహరణ అనంతరం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.మండలంలో 128 వార్డు సభ్యులకు గాను 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. మిగిలిన 102 వార్డు సభ్యుల పదవుల కోసం 237 మంది పోటీ పడుతున్నారు
ఉపసంహరణ ముగిసింది….పోరు మిగిలింది.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



