Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్ణగిరిలో దొంగతనం…

పూర్ణగిరిలో దొంగతనం…

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-భువనగిరి : గుర్తుతెలియని దుండగులు హుండీని పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధిలోని నమత్ పల్లి గ్రామంలో పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో గల పూర్ణగిరి స్వయంభు శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లారు. కాగా సోమవారం గుడిని తెరిచి చూడగా పనిచేసే సిబ్బంది హుండీ పగలగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. కాగా సంఘటన స్థలాన్ని సిఐ చంద్రబాబు, రూరల్ ఎస్సై అనిల్ సందర్శించి వివరాలను సేకరించారు. కాగా ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -