Saturday, August 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాల‌స్తీనాను తాము గుర్తిస్తున్నాం: కెనడా

పాల‌స్తీనాను తాము గుర్తిస్తున్నాం: కెనడా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాల‌స్తీనాకు కెన‌డా మ‌ద్ద‌తుగా నిలిచింది. పాల‌స్తీనా దేశాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ‘కెనడా 2025 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాలని భావిస్తోంది, “గాజాలో పౌరుల బాధలను మరింత దిగజార్చడం” శాంతికి తోడ్పడటానికి సమన్వయ అంతర్జాతీయ చర్యలో ఆలస్యం కావడానికి స్థలం లేదు “అని ప్రధానమంత్రి అన్నారు.

గాజాపై ఇజ్రాయిల్ సైన్యాలు భీక‌ర‌దాడుల‌కు తెగ‌బ‌డుతూ..భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో గాజాలో రోజురోజుకు ఆక‌లి చావుల‌తో పాటు అనేక ఇజ్రాయిల్ దాడుల‌కు బ‌లి అవుతున్నారు. ఈక్రమంలో యూర‌ప్ దేశాల నుంచి పాల‌స్తీనాకు రోజురోజుకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. అర‌బ్ దేశాలు కూడా పాల‌స్తీనా ఆథారిటీకి పాల‌న అప్ప‌గించాల‌ని, దాడుల‌కు స్వ‌స్త చెప్పాల‌ని హ‌మాస్‌కు అల్టిమేటం జారీ చేశాయి. ఈక్ర‌మంలో కెన‌డా పాల‌స్తీనా దేశాన్ని గుర్తించిన‌ట్లు వెల్ల‌డించ‌డంపై ప్ర‌పంచ శాంతికాముకులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది వ‌ర‌కు యూకే, ఫ్రాన్స్ కూడా పాల‌స్తీనాను గుర్తించిన‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -