నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తెలిసిన విషయం తెలిసిందే. టేకాప్ అయిన కొన్ని సెకన్లకే విమానం కూలిపోయింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారం తర్వాత ఇటీవల తొలి నివేదిక విడుదలైంది. ఇంధన స్విచ్‌లు ఆప్ చేయడంతో ఆయిల్ సరఫరా నిలిచిపోయింది పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజా ప్రమాదానికి గురైన బోయింగ్ సంస్థ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 14న అన్ని ఎయిర్‌లైన్ సంస్థల్ని ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787, బోయింగ్ 737 విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను చెక్ చేసింది. ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో ఎలాంటి సమస్యలు కనుగొనబడలేదు’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.
‘‘తనిఖీలలో, లాకింగ్ మెకానిజంతో ఎటువంటి సమస్యలు కనుగొనబడలేదు. ఎయిర్ ఇండియా జూలై 12న స్వచ్ఛంద తనిఖీలను ప్రారంభించింది మరియు DGCA నిర్దేశించిన నిర్ణీత సమయ పరిమితిలోపు వాటిని పూర్తి చేసింది. అదే విషయాన్ని నియంత్రణ సంస్థకు తెలియజేయబడింది’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.