– ముగ్గురు ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల డిస్మిస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ వర్సిటీలో వెలుగు చూసిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం అశ్వారావుపేట లో కలకలం రేపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ 35 మందిలో అశ్వారావుపేట కళాశాలలో చదువుతున్న ముగ్గురు ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల ఉన్నారు. ఇదే విషయం అయి శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు మేళా కు హాజరైన ఉప కులపతి ప్రొఫెసర్ అల్ట్రాస్ జానయ్య నవతెలంగాణ వివరణ కోరగా ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించామని తెలిపారు.
ఈ తతంగం వరంగల్ నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తుందని,డిజిటల్ పెన్ తో జవాబులు ఇచ్చినట్లు పరీక్ష హాల్ లోని సీసీ పుటేజీల తో తేలిందని అన్నారు.సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.



