Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుDharmendra : భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

Dharmendra : భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన నటుడు ధర్మేంద్ర మరణం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశంలో పేర్కొన్నారు. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ నటుడు ధర్మేంద్రని కోల్పోవడం భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు అని అన్నారు.

ధర్మేంద్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి అభిమానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కాగా, ఇండస్ట్రీలో ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో ధర్మేంద్ర రాణించారు. వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో సోమవారం తుదిశ్వాస విడిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -