Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కరవు..!

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కరవు..!

- Advertisement -

-జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలుతున్న మోయతుమ్మెద ఇసుక 
-తోటపల్లిలో రామాలయం,వెంచర్ అవరణాల్లో ఇసుక నిల్వలు
-అక్రమ రవాణను అరికట్టాలని రైతుల అవేదన 
నవతెలంగాణ-బెజ్జంకి

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కరువైంది.మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని రామాలయం,ఓ వెంచర్ ఇసుక అక్రమ నిల్వలకు నిలయాలుగా మారాయి. మాఫీయదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కరువును సృష్టించి రేయింబవళ్లు బోలేరో,అశోక్ లేలాండ్ వాటి చిన్న వాహనాల్లో అక్రమంగా జిల్లా కేంద్రానికి తరలించడం అధికారుల పర్యవేక్షణ లోపానికి తార్కణంగా నిలుస్తోంది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు  ఇసుక రవాణ చేయడానికి రవాణదారులు అనాసక్తి చూపుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

మరోపక్క అధికారుల అండతోనే తోటపల్లి ఇసుక మాఫీయదారులు అక్రమ నిల్వలేర్పాటు చేసి విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారనే  అపవాదు ప్రజల్లో వినిపిస్తోంది.ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి రేయింబవళ్లు అక్రమంగా తరలుతున్న ఇసుకను అరికట్టి ఇందిరమ్మ నిర్మాణాలకు ఇసుకను అందించాల్సిన భాధ్యత ఉంది.

సుమారు 30 చిన్న వాహనాల్లో నిత్యం తరలింపు

మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు ఇసుకను నిత్యం రేయింబవళ్లు సుమారు 30 చిన్న వాహనాల్లో జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్నట్టు వినికిడి.కోహెడ మండలంలోని వింజపల్లి,చిన్నకోడూర్ మండలంలోని ఇబ్రహీంనగర్,మండలానికి చెందిన పలు చిన్న వాహనాల్లో ఇసుక అక్రమంగా తరలుతోందని సమాచారం.గాగీల్లపూర్ గ్రామంలోని పలువురు ఇసుక రవాణదారులు ఏకంగా ట్రాక్టర్ల ద్వారానే జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

ఇసుక అక్రమ రవాణను సీపీ అరికట్టాలి

నూతన జిల్లా సీపీగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ మండలంలోని తోటపల్లి,గాగీల్లపూర్ గ్రామాల నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫీయదారులపై తగు చర్యలు చేపట్టి రవాణను అరికట్టాలని మోయతుమ్మెద వాగు పరిసరాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇసుక మాఫీయదారులు ఇష్టారీతిన వ్యవహరించడం వల్ల పంటపోలాలు ధ్వంసమవుతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -