Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం లేదు..

ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం లేదు..

- Advertisement -

– జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌
శ్రీనగర్‌: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం గురించి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ ఇతర దేశాలకు వెల్లడిస్తూ.. వారి మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్‌ వ్యవహ రిస్తే.. భారత్‌ నుంచి ప్రతిస్పందన మరింత గట్టిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం మాత్రం తమకు లేదని వెల్లడించారు. ఇదే విషయాన్ని అమెరికా, బ్రిటన్‌, సౌదీ అరేబియా, జపాన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులకూ ధోవల్‌ వివరించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్‌ నిర్వహించడానికి గల కారణాలను ఆయన ప్రపంచ దేశాలకు వివరించినట్టు అధికారులు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా అక్కడి ఉగ్రవాదుల శిబిరాలపై దాడుల అమలు వివరాలు వారికి చెప్పినట్టు సమాచారం. భారత మిత్రదేశాలతో భవిష్యత్తులోనూ సమాచారం పంచుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు ఆయన 8 దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad