Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌లో జర్నలిస్టుల ప్రస్తావనే లేదు

బడ్జెట్‌లో జర్నలిస్టుల ప్రస్తావనే లేదు

- Advertisement -

టీడబ్ల్యూజేఎఫ్‌ ఆగ్రహం

నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక్క ప్రస్తావన కూడా లేకపోవడం దారుణమని అభిప్రాయపడింది. ఆ సంఘం యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పి రాంచందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య సంయుక్తంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమాచార శాఖను పూర్తిగా మరిచిపోయిన ప్రభుత్వం, మీడియా అకాడమీ గురించి కూడా ఒక్క మాట ప్రస్తావించలేదని విమర్శించారు.బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేకుండా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇండ్ల స్థలాల కేటాయింపు, డిజిటల్‌ హెల్త్‌ కార్డులు, మహిళా జర్నలిస్టుల సమస్యలపై కూడా ఎలాంటి చర్చ లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అక్రిడిటేషన్లు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు రెండేండ్లుగా అక్రిడిటేషన్‌ గడువును పొడిగిస్తూ పోతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దష్టికి తీసుకెళ్తున్న మీడియాను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ‘ఫ్యూచర్‌ సిటీ’లో ఇండ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని కూడా బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం జర్నలిస్టుల్లో తీవ్ర ఆవేదన, ఆందోళనకు దారితీసిందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -