Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాహుల్‌ గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదు

రాహుల్‌ గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదు

- Advertisement -

– కేటీఆర్‌కు జగ్గారెడ్డి వార్నింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌ గాంధీకి దేశ భవిష్యత్‌పై విజన్‌ లేదంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తెలంగాణ, ఆంధ్రలోనూ నష్టమే అని తెలిసినా ప్రజల కోసం తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ఇచ్చిన తెలంగాణ వల్లే కేసీఆర్‌ సీఎం, కేటీఆర్‌ మంత్రి అయ్యారని గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీది త్యాగాలు చేసిన కుటుంబమని గుర్తుచేశారు. పంపకాల కోసం ఘర్షణలు పడుతున్న కుటుంబం కేటీఆర్‌దని చెప్పారు. అలాంటి కేటీఆర్‌ కు రాహుల్‌ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -