Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు

ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు

- Advertisement -

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 
– బిఆర్ఎస్ కార్యకర్త రంజిత్ పై దాడికి ఖండన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 

ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, బిఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్ పై జరిగిన కిరాతక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచాడన్న అక్కస్సుతో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు గొడ్డలితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలపాలైన రంజిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ మనోరమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్‌ నర్సయ్యతో ఫోన్ లో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకొన్నారు.మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ తోనూ మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకొని, బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అండతో అనుచరులు రెచ్చిపోవడం ప్రజల భద్రతకు ముప్పుగా మారిందన్నారు.ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కామారెడ్డి ఎస్పీ ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -