– నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
– ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ సమావేశం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతానికి తావు లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన సమావేశమైంది. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనలపై చర్చించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జె.సత్యనారాయణ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు ప్రిన్సిపాల్ ఆర్.రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సురేస్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ర్యాగింగ్‌కు తావు లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



