నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పాల్గొని ‘ ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్స్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగించారు జస్టిస్ గవాయ్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాను సరిదిద్ది న్యాయవ్యవస్థ కీలక బాధ్యత వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రీమిలేయర్ ఉండాలి: బీఆర్ గవాయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



